ఎల్లారెడ్డిలో FPO సభ్యులకు ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్ల పంపిణీ
ఎల్లారెడ్డిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో FPO (Farmer Producer Organisation) సభ్యులకు ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షులు ఎగుల నర్సింహులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
FPOలో మొదటి విడతగా రూ.2,000 చెల్లించి సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం ద్వారా అందిన ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తెలిపింది.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఎగుల నర్సింహులు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిలో FPOలో మొత్తం 750 మంది రైతులకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉండగా, మొదటి విడతలో 434 మంది రైతులు సభ్యులుగా చేరారని తెలిపారు. వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈక్విటీ గ్రాంట్ మంజూరైందని పేర్కొన్నారు.
ప్రస్తుతం FPO సభ్యత్వ నమోదు కొనసాగుతోందని, ఇప్పటివరకు మొత్తం 436 మంది రైతులు సభ్యత్వం పొందారని ఎగుల నర్సింహులు వెల్లడించారు. త్వరలోనే నిర్దేశించిన 750 మంది సభ్యుల లక్ష్యాన్ని చేరుకుని, FPO ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు.
సభ్యత్వ లక్ష్యానికి చేరువలో ఉన్నందున FPOలో సభ్యత్వం పొందేందుకు ఆసక్తి ఉన్న రైతులు సంఘ సిబ్బందిని సంప్రదించి సభ్యత్వం పొందాలని ఎగుల నర్సింహులు కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.