ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ, ఐక్యూఏసీ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఇ. లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రిన్సిపాల్ డా. ఇ. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ అన్య భాషల వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
తెలుగు శాఖ అధ్యక్షుడు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. వి. శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, పీరీల పాటలు తెలంగాణ భాషలోనే జీవం పోసుకున్నాయని అన్నారు. మాతృభాషతో పాటు తమ చుట్టూ ఉన్న విభిన్న యాసలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలుగు సీనియర్ అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే కవితలను వినిపించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌కేసీ సమన్వయకర్త జంగం శివకుమార్, అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు, డా. గంగారెడ్డి, డా. సిద్దురాజ్, సంతోష్, చంద్రకాంత్, శశిధర్, రాణి, డా. గోదావరి, సురేష్ రెడ్డి, నరేష్ గౌడ్, రాజు, కీర్తి స్వప్న, లక్ష్మణ్, పవన్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.