ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
ఎల్లారెడ్డిలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ డా. ఇ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రాంతానికి మాత్రం ఆ రోజు స్వేచ్ఛ రాలేదని పేర్కొన్నారు.
నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ నిజాం పాలనలో, రజాకార్ల అరాచకాలతో ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన తెలిపారు. అమాయక ప్రజలపై దాడులు, భూస్వాముల వెట్టిచాకిరీతో ప్రజల జీవితాలు అంధకారమయ్యాయని పేర్కొన్నారు.
ఆ అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం చేశారని డా. లక్ష్మీనారాయణ తెలిపారు. ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు.
ఆనాటి వీరుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. ఎం. చంద్రకాంత్, ఐ.క్యు.ఏ.సి సమన్వయకర్త డా. వి. శంకరయ్య, టి.యస్.కె.సి సమన్వయకర్త జంగం శివకుమార్, అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావ్, నాగానిక, డా. అరుణ్ కుమార్, కృష్ణ ప్రసాద్, రాణి, చంద్రకాంత్, శశిధర్, సంతోష్, డా. గోదావరి, సురేష్ రెడ్డి, సంగీత, కీర్తి స్వప్న, మహమూద్, నరేష్ గౌడ్, లక్ష్మణ్, సూపరింటెండెంట్ వసంత లక్ష్మి, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.