ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తూ 2026-27 విద్యా సంవత్సరంలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన ముగ్గురు అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
పదోన్నతి పొందిన డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ (అసోసియేట్ ప్రొఫెసర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపాల్), డాక్టర్ ఎం. చంద్రకాంత్ (అసోసియేట్ ప్రొఫెసర్, హిస్టరీ, వైస్ ప్రిన్సిపాల్), వి. శంకరయ్య (అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు)లను బీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా బీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు నిమ్న గౌతమి, వసుధ, బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సౌందర్య తమ అధ్యాపకుల పదోన్నతిపై మాట్లాడారు. అధ్యాపకుల పదోన్నతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చంద్రకాంత్, డాక్టర్ వి. శంకరయ్య విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తమ జీవితాల్లో ఎదుగుదలకు అవసరమైన అంశాలను వివరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధ్యాపకులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల IQAC సమన్వయకర్త డాక్టర్ వి. శంకరయ్య, TSKC కోఆర్డినేటర్ శివకుమార్, ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు కృష్ణ ప్రసాద్, రాజకీయ శాస్త్ర అధ్యాపకులు లక్ష్మణ్, TSKC మెంటర్ రాజు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.