‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్రకు ఎమ్మెల్యే మదన్ మోహన్ మద్దతు
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పేరుతో పాదయాత్ర చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు యాత్రకు మద్దతుగా నిర్వహించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన కన్యాకుమారి–కశ్మీర్ పాదయాత్ర అభినందనీయమని అన్నారు.
ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శుభాకాంక్షలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.