మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కూన శ్రీశైలం గౌడ్
షాపూర్ నగర్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి అనే సూత్రాలతో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.