వెల్లుట్లపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్లుట్లపేట గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కొయ్యల వినోద రాజా గౌడ్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గ్రామ ఉపసర్పంచ్ రాజు యాదవ్, అధ్యక్షులు పెంట అంజయ్య సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉండాలని పిలుపు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం విముక్త చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ ప్రజాపాలన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొర్వి శిరీష, కర్రిచెవుల రవి, గోసం పోచయ్య, కుమ్మరి కేశవ్వ, ఫీల్డ్ అసిస్టెంట్ బొల్లు భూమయ్యతో పాటు గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.