గార్ల మండలంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరపాలి: కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి
గార్ల మండలం
గార్ల మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఎటువంటి డీజేలు పెట్టకుండా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని గార్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ అన్నారు.
ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు, అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య ఆదేశానుసారం ఈ విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతీ హతిరం, ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, చిన్న బంజర సర్పంచ్ మోతిలాల్, పుల్లూరు మాజీ సర్పంచ్ జాటోత్ రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ యాకుబ్ పాషా, గార్ల మండలం ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య బాబూలాల్, కోలా కుమార్ గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.