ఎల్లారెడ్డిలో GO Ms.No.59 పెండింగ్ దరఖాస్తులపై విచారణ

పూర్తి రుసుము చెల్లించని 9 మందికి నోటీసులు జారీ

పవార్ వార్త, ఎల్లారెడ్డి: GO Ms.No.59 కింద భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి రుసుము చెల్లించని ఎల్లారెడ్డి మండలానికి చెందిన 9 మంది దరఖాస్తుదారులకు తక్షణమే చెల్లింపులు జరిపి క్రమబద్ధీకరణ చేసుకోవాలని కోరుతూ తహసీల్దార్ ప్రేమ్ కుమార్ నోటీసులు జారీ చేశారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఈరోజు విచారణ నిర్వహించిన అనంతరం సంబంధిత దరఖాస్తుదారులకు నోటీసులు అందజేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మిగిలిన రుసుమును చెల్లించి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని నోటీసుల్లో కోరినట్లు సమాచారం.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి