గ్రేటర్ హైదరాబాద్ విముక్తి కన్వీనర్లుగా తుమ్మరాణి, యమున గౌడ్ నియామకం
గ్రేటర్ హైదరాబాద్ విముక్తి కన్వీనర్లుగా తుమ్మరాణి, యమున గౌడ్ నియామకం
సిపిఐ (ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ అనుబంధ సంస్థ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడభ్ల్యూ – విముక్తి) గ్రేటర్ హైదరాబాద్ మహిళా కార్యకర్తల సమావేశం సెప్టెంబర్ 24న కీసర సర్కిల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని దళిత సంక్షేమ భవనంలో జరిగింది. ఈ సమావేశం ఆ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గడిపే సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కార్యదర్శి షేక్ షావలి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ముఖ్యంగా పీడిత వర్గాల మహిళలపై అమానుష, అమానవీయ, అసమానతలు, అసహజత్వాలు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, శారీరక, మానసిక హింసలు గత 13 సంవత్సరాల కాలంలో తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం ఎన్ని చట్టాలు చేసినా, అవి ఉన్నత వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే చుట్టాలుగా మారాయని, సామాన్య పేద, మధ్యతరగతి స్త్రీలకు తగిన రక్షణ, భద్రత కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో శ్రామిక మహిళల స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, అభివృద్ధిని గుర్తించలేకపోతున్నారని షేక్ షావలి పేర్కొన్నారు. అన్ని రకాల దోపిడీ, పీడన, అణిచివేతలతో పాటు మహిళలను రెండవ తరగతి శ్రేణిగా, బానిసలుగా మార్చే సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని గుర్తుచేశారు. కుల, మతోన్మాదులు అంధవిశ్వాలను పెంచి, ప్రజల చైతన్యాన్ని మొద్దుబారుస్తున్నారని ఆరోపించారు. తమ విధానాలను వ్యతిరేకించే మహిళలపై అన్ని రకాల హింసలకు గురిచేస్తారని అన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమించే మహిళా కార్యకర్తలు, నాయకులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు అకారణంగా తప్పుడు కేసులకు గురిచేసి, ఎళ్ల తరబడి విచారణలు లేకుండా జైళ్లలో నిర్భంధిస్తున్నారని ఆరోపించారు.
ప్రతి మహిళా మనిషిని మనిషిగా గుర్తించే సమసమాజ స్థాపనకు జరిగే వర్గ పోరాటాలలో భాగస్వాములు కావాలని షేక్ షావలి పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం ద్వారానే అన్ని వర్గాల మహిళలకు సంపూర్ణ విముక్తి సాధ్యమని గుర్తించి, తమపై జరిగే అన్ని రకాల వేధింపులకు వ్యతిరేకంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన మహిళా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమాజంలో మహిళలపై చులకన భావాన్ని ప్రదర్శించే పురుషాధిక్యత సంస్కృతి, భావజాలానికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తే తప్ప ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని సాధించలేమని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం గ్రేటర్ హైదరాబాద్ పీఓడభ్ల్యూ (విముక్తి) కన్వీనర్‌గా తుమ్మరాణి, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ కన్వీనర్‌గా యమున గౌడ్‌లను నియమిస్తున్నట్లు గడిపే సునీత ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేయాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
నేపథ్యం: రాంకీ డంపింగ్ యార్డు సమస్య
జవహర్ నగర్ రాంకీ చెత్త డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడే కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమవడంతో పాటు వాయు కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. స్థానికులు చర్మ వ్యాధులు, సైనస్ సమస్యలతో సతమతమవుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.
డంపింగ్ యార్డు చుట్టూ సుమారు 20 వరకు అక్రమంగా లీచెట్ వాటర్ పాండ్లను ఏర్పాటు చేశారని, విషపూరితమైన లీచెట్ నీటిని ఈ పాండ్లలో నిల్వ చేస్తున్నారని వార్తలు తెలిపాయి. ఈ సమస్యపై స్థానికులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయించారు.
డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి ఆధ్వర్యంలో జవహర్ నగర్, దమ్మాయిగూడ జేఏసీలు పలు సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించాయి. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేశారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.