హాజీపూర్ తాండలో ముగిసిన ఐదు మంగళవారాల గిరిజన ఉపవాస దీక్షలు

ఎల్లారెడ్డి, సెప్టెంబరు 15: మండలంలోని హాజీపూర్ తండాలో గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఐదు మంగళవారాల ఉపవాస దీక్షలు సోమవారం ముగిశాయి.

దీక్షల ముగింపు సందర్భంగా తండా గిరిజనులు, మహిళలు జగదాంబ మాత, సంత్ సేవాలాల్ మహారాజ్, తపస్వి రామారావు మహారాజ్‌లకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో తండా సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.

సంప్రదాయ దుస్తుల్లో గిరిజన మహిళల నృత్యాలు

పూజల అనంతరం గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి గోర్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. మహిళల సంప్రదాయ నృత్యాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేష్, తండా నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply