హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ విఘ్నేశ్వరుడి నిమజ్జన మహోత్సవం
కీసర మండలం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని వెంకులోని గుట్ట, రాంపల్లి దాయరలో హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వరుడి నిమజ్జన మహోత్సవం భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య అత్యంత వైభవంగా ముగిసింది.
ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వర లడ్డు వేలంపాటలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేలంపాటలో శ్రీ గరుగుల ఆండాళ్ – మల్లేష్ గార్లు (మాజీ సర్పంచ్‌లు) అత్యధికంగా రూ. 32,000/- కు లడ్డును దక్కించుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎల్లప్పుడూ కలగాలని దేవస్థానం తరఫున ఆకాంక్షించారు.
ఈ మహోత్సవంలో దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ శ్రీ కందాడి హేమలత – హనుమంత్ రెడ్డి గార్లు, ట్రస్ట్ సభ్యులు శ్రీ కామసాని వసంత – బాల్ రెడ్డి గార్లు, శ్రీ కందాడి సుధారాణి – పురుషోత్తం రెడ్డి గార్లు, శ్రీ కామసాని అనిత – శ్రీనివాస్ రెడ్డి గార్లు, శ్రీ రామిడి మానస – రాజిరెడ్డి గార్లు, శ్రీ స్వరూప – నాగిరెడ్డి గార్లు, శ్రీ గాడి స్వప్న – రాము గార్లు, శ్రీ గుండబొయిన సుభాష్ గార్లు మరియు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దేవస్థాన కార్యక్రమాలకు సహకరించిన భక్తులందరికీ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కందాడి హనుమంత్ రెడ్డి గార్లు మరియు ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.