గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ
మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ బుధవారం గంగారం, గూడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలు చేస్తున్న వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ఆరోగ్య పథకాల రికార్డులను, అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యసాధనపై వైద్యాధికారితో సమీక్ష నిర్వహించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే 0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అవసరమైన మందులు, పరీక్షా కిట్లు తదితర వైద్య సామగ్రిని తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారికి సూచించారు.
జిల్లాలో జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాల ఏర్పాట్లను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు మరియు ఇతర అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గంగారం మండలంలోని వైద్యాధికారి డాక్టర్ కిరణ్, గూడూరు మండలంలోని వైద్యాధికారి డాక్టర్ పవన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.