నిజాంసాగర్ మండలంలో కల్వర్టు బ్రిడ్జి శంకుస్థాపన, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో కల్వర్టు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 24న ఉదయం 10:00 గంటలకు నిర్వహించబడుతుంది.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మరియు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమానికి గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు గారు, డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు, ఏఎంసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ గారు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి నిజాంసాగర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.