జలాల్‌పూర్‌లో ఇందిరమ్మ ఇంట్లో మంజుల కుటుంబం గృహప్రవేశం
నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు మంజుల కుటుంబంలో గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. సొంతింటి కల నెరవేరడంతో మంజుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. తమ కుటుంబానికి ఇల్లు మంజూరయ్యేలా సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజలకు ఇచ్చిన మాటను గౌరవించి, వారి కష్టాలను అర్థం చేసుకుని అండగా నిలిచే నిస్వార్థమైన, స్వచ్ఛమైన మనసున్న నాయకుడు మదన్ మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉండటం మా నియోజకవర్గ ప్రజల అదృష్టం.”
ప్రజలకు ఇచ్చిన మాటను గౌరవించి, వారి కష్టాలను అర్థం చేసుకుని అండగా నిలిచే నాయకుడిగా మదన్ మోహన్‌ను తాము భావిస్తున్నామని మంజుల పేర్కొన్నారు. తమ కుటుంబానికి సొంతింటి కలను నిజం చేసినందుకు ఆయనను జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు.
తమ కుటుంబం తరఫున ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు మంజుల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.