జవహర్ నగర్లో డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులకు శ్రీకారం
జవహర్ నగర్‌కు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులు: వజ్రేష్ యాదవ్
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, జవహర్ నగర్: జవహర్ నగర్లో డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. చంద్రపురి కాలనీలో రూ.1.36 కోట్లతో, గాంధీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో చేపట్టనున్న పనులను మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు.
చంద్రపురి, గాంధీనగర్‌లో అభివృద్ధి పనులు
చంద్రపురి కాలనీలో రూ.1.36 కోట్లతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వజ్రేష్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్ నగర్లో రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యా సంస్థల అభివృద్ధికి నిధులు
జవహర్ నగర్లో బిట్స్ పిలానీ పక్కన 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నట్లు వజ్రేష్ యాదవ్ గుర్తు చేశారు. బాలాజీనగర్‌లోని పాఠశాల అభివృద్ధికి రూ.43 కోట్లు, మరో హైస్కూల్ నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జవహర్ నగర్లో విద్యాసంస్థల అభివృద్ధి కోసం మొత్తం దాదాపు రూ.300 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రస్తావన
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని వజ్రేష్ యాదవ్ తెలిపారు. ఒక్క నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు ఇస్తున్నామని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు కేటాయిస్తూ పనులను అమలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 వేల చెరువుల్లో పూడికతీత చేపట్టి కట్టల నిర్మాణం చేపడతామని, మూసీ నది ప్రక్షాళనతో పాటు హైదరాబాద్ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని వజ్రేష్ యాదవ్ తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రపురి డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ మూడో డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి సదానందం, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు, బల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ గౌడ్, మహిళా నాయకులు, ఇతర కాంగ్రెస్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.











