జుక్కల్: గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు కృతజ్ఞతగా జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ గిరిజన, ఆదివాసీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గిరిజన, ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయులు గిరిజనుల హక్కులు, స్వాభిమానం, ఆత్మగౌరవం కోసం పోరాడారని పేర్కొన్నారు. వారి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ “మా తాండాలో మా రాజ్యం” అనే ఆకాంక్షతో గిరిజన సమాజం ముందుకు సాగుతోందని తెలిపారు.
“మేమెంత ఉన్నామో, మాకు కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి” అనే న్యాయబద్ధమైన డిమాండ్ గిరిజన సమాజంలో ఉందని నాయకులు పేర్కొన్నారు. గిరిజనుల జనాభా ప్రాతిపదికన వారికి తగిన ప్రాతినిధ్యం, హక్కులు, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వారు గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో జుక్కల్ మండల కేంద్రంలోని సేవాలాల్ మహారాజ్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గిరిజన, ఆదివాసీ నాయకులతో పాటు పార్టీ నాయకులు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.