కామారెడ్డిలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, మండల అధ్యక్షులు రాజగౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.