ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో గురువారం హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ప్రియదర్శిని మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న హిందీ భాషను రాష్ట్ర భాషగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అల్తమాష్ జహంగీర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణ్ సింగ్, విద్యారమణ, హిందీ ఉపాధ్యాయులు బలవంతరావు, శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.