కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డిమాండ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం కాంగ్రెస్ నాయకులు నల్ల చొక్కాలు ధరించి నిరసన చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

ఓటు హక్కు పరిరక్షణపై కలెక్టర్‌కు వినతిపత్రం

నిరసన అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply