రెడ్‌క్రాస్ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు: డాక్టర్ ఎన్. బాలు ఆరోపణ

కామారెడ్డి: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ పదవుల ఎంపికలో తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎన్. బాలు ఆరోపించారు. వైస్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మాట మార్చారని విమర్శించారు.

ఎన్నికల ఖర్చు ఆదా చేయాలనే నామినేషన్లు ఉపసంహరించుకున్నాం

రెడ్‌క్రాస్ ఎన్నికల్లో పోటీ జరిగితే సంస్థకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతాయని, ఆ మొత్తాన్ని సామాజిక సేవలకు వినియోగించాలనే ఉద్దేశంతో పది మంది సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని బాలు తెలిపారు.

పిట్లంకు చెందిన ముక్కెర సంజీవరెడ్డి చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరడంతో ఏకగ్రీవ ఎంపికకు సహకరించామని చెప్పారు. ఈ సందర్భంగా తనకు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి, తర్వాత ఇవ్వలేదని ఆరోపించారు.

సేవా కార్యక్రమాలు నిర్వహించేవారికి ప్రాధాన్యం ఇవ్వాలి

జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండని వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికేతరులకు కీలక పదవులు ఇచ్చారని బాలు విమర్శించారు. రక్తదానం, ఆపదలో ఉన్నవారికి సహాయం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారికి పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

రెడ్‌క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు నాయకత్వ బాధ్యతలు చేపడితే సంస్థ సేవలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.

84 సార్లు రక్తదానం చేశానని వెల్లడి

తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేశానని, తలసేమియా బాధిత చిన్నారుల కోసం 5 వేల యూనిట్ల రక్తాన్ని సమకూర్చేందుకు కృషి చేశానని బాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించిన అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.

ఇంతటి సేవా అనుభవం ఉన్న తనకు అవకాశం ఇవ్వకుండా, ఇతరులకు వైస్ చైర్మన్, కోశాధికారి పదవులు కేటాయించడాన్ని ఆయన ప్రశ్నించారు. పదవులు ఉన్నా లేకపోయినా తలసేమియా బాధిత చిన్నారులకు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనవారికి సహాయం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply