గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ | సెప్టెంబర్ 27, 2026

నిజామాబాద్: గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రజలు, గణేష్ మండళ్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందించిన సహకారాన్ని అభినందించారు.

కమిషనరేట్ పరిధిలో 5,811 గణేష్ విగ్రహాలు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 5,811 గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. భక్తులు సంప్రదాయం ప్రకారం తొమ్మిది, పదకొండు రోజులపాటు మండపాల్లో పూజలు నిర్వహించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పేర్కొంది.

అన్ని మతాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో ఉత్సవాలు శాంతియుతంగా జరిగాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు

గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని బాసర బ్రిడ్జి వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాసర, ఉమ్మెడతోపాటు ఇతర నిమజ్జన ప్రాంతాల్లోనూ పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు

ఉత్సవాల నిర్వహణలో సార్వజనిక్ గణేష్ మండళ్లు, గణేష్ విగ్రహ కమిటీలు, మసీదు కమిటీలు, అన్ని మతాల ప్రజలు పోలీస్ శాఖకు సహకరించారని సీపీ పేర్కొన్నారు.

రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, అబ్కారీ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బందితోపాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, గజ ఈతగాళ్లు అందించిన సేవలను అభినందించారు. ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply