కాప్రాలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ స్వాగత తోరణం పనులు ప్రారంభం
కాప్రా విలేజ్‌లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ స్వాగత తోరణం (ఆర్చ్) నూతన నిర్మాణ పనులను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గత సంవత్సరం ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి సహకరించి, ఆలయ ప్రాంగణాన్ని ఆధునీకరించి అభివృద్ధి చేశారని పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్ పొట్టు బాబురావు, సభ్యులు పడమటి మల్లారెడ్డి, ఓర్ల శ్రీధర్ రెడ్డి, పబ్బతి నరేందర్ గౌడ్, ఉప్పల వినోద్ కుమార్, గుడ్డి సత్యనారాయణలను ఆయన అభినందించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ఈవో కృష్ణమాచార్యులు, ప్రధానార్చకులు రవిశర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ దండెంల మురళి, కాప్రా డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు శ్రీహరి, మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, డైరెక్టర్ పూర్ణ యాదవ్, మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు పాల్గొన్నారు.
ఒంపుగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుప్ రాజు (టిల్లు యాదవ్), కుషాయిగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌకుంట్ల ప్రకాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ అజీజ్, మాజీ కౌన్సిలర్ రాజేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజిరెడ్డి, భూపాల్ రెడ్డి, రాకేష్ యాదవ్, రిజ్వాన్ ఖాన్, శ్రీకాంత్ గౌడ్, తోటకూర శ్రీకాంత్, డి. సతీష్ యాదవ్, సి. సత్యనారాయణ, జగదీష్ గౌడ్, గుణశేఖర్, అల్లం సతీష్ యాదవ్, కే. రాజు, నాగరాజు యాదవ్, రాజాషీలన్, శివకుమార్, సిద్ధిఖ్, మహిళా నాయకులు జ్యోతి, లక్ష్మి, స్వర్ణలత, యూత్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్, పవన్ కళ్యాణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.