నిజామాబాద్‌లో బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
నిజామాబాద్ జిల్లా బంజారా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత బంజారా/లంబాడ ప్రజలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బంజారా/లంబాడ ప్రజలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించేందుకు కృషి చేసిన ఆనాటి బంజారా నాయకులకు భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రవీంద్ర నాయక్, అమర్ సింగ్ తిలావత్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్, జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్, ఉద్యోగ సంఘం అధ్యక్షులు దశరత్ నాయక్, కార్యదర్శి శివలాల్, ఆర్డీవో వెంకటయ్య, మున్ని నాయక్, లాల్ సింగ్, మారుతి, బలరాం, శంకర్, నరహరి, జెడి శంకర్, భావ్ సింగ్, రైమల్ తదితర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సంఘం ఫౌండర్ అధ్యక్షులు దశరత్ నాయక్, కార్యదర్శి శివలాల్, వారి బృందానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.