సామాజిక విలువలను చాటుతున్న ‘పిలుపు’ కవితలు
యువత చదవదగిన పుస్తకం ‘పిలుపు’.. సమీక్షకుల అభిప్రాయం
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, కామారెడ్డి: ప్రముఖ కవి, రచయిత బి. ప్రేమ్ లాల్ రచించిన ‘పిలుపు’ పుస్తకంలోని కవితలు సమాజంలోని పలు అంశాలపై ఆలోచింపజేస్తున్నాయని ప్రముఖ కవులు ఎనిశెట్టి గంగా ప్రసాద్, కాసర్ల రామచంద్రం అన్నారు. యువత తప్పనిసరిగా చదవదగిన పుస్తకమని వారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రచయితల వేదిక (తెరవే) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుస్తక సమీక్ష కార్యక్రమంలో ఎనిశెట్టి గంగా ప్రసాద్, కాసర్ల రామచంద్రం సమీక్షకులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పతనమవుతున్న నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలను ‘పిలుపు’ పుస్తకంలోని కవితలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. సరళమైన భాషలో తక్కువ పదాలతో లోతైన భావాలను వ్యక్తం చేసేలా రచనలు ఉన్నాయని వివరించారు.
కవితా గానం చేసిన కవులు
కార్యక్రమంలో కాసర్ల రామచంద్రం, కౌడి రవీందర్, చంద్రకాంత్, సంఘ గౌడ్, తిరుపతిరావు, అల్లాడి నరసయ్య తదితరులు ‘పిలుపు’ పుస్తకంలోని కవితలను ఆలపించారు.
అనంతరం రచయిత బి. ప్రేమ్ లాల్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అంశాలపై మరిన్ని రచనలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధులు ఆయనను సన్మానించారు.
కార్యక్రమంలో తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్, ఎన్నీల ముచ్చట్లు ప్రధాన సమన్వయకర్త ఎనిశెట్టి గంగా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు కాసర్ల రామచంద్రం, అల్లాడి నరసయ్య, కార్యదర్శులు తిరుపతిరావు, చంద్రకాంత్, కౌడి రవీందర్, సంఘ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.













