మాచారెడ్డి పోలీసుల చొరవతో రూ.60 వేల DJ అడ్వాన్స్ తిరిగి
- DJ కోసం చెల్లించిన రూ.60,000 అడ్వాన్స్ పూర్తిగా తిరిగి ఇప్పించిన పోలీసులు
- మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీ విజయ్ చొరవతో సమస్యకు పరిష్కారం
- DJ వినియోగానికి అనుమతి లేని నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన గణపతి నిర్వాహకుడు
- ప్రజల సమస్యలకు మానవీయ దృక్పథంతో పరిష్కారం చూపుతున్నామని పోలీసుల ప్రకటన
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ ఏర్పాటు కోసం చెల్లించిన రూ.60,000 అడ్వాన్స్ మొత్తాన్ని మాచారెడ్డి పోలీసులు తిరిగి ఇప్పించారు.
అక్కాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ్ యూత్ గణపతి మండల అధ్యక్షుడు గడ్డం శ్రీకాంత్ సుమారు 15 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన “LADDU RRR DJ” నిర్వాహకుడికి రూ.60,000 అడ్వాన్స్‌గా చెల్లించారు.
DJకు అనుమతి లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన శ్రీకాంత్
గణేష్ ఉత్సవాల సందర్భంగా DJ వినియోగానికి అనుమతి లేదని తెలియడంతో, తాను ముందుగా చెల్లించిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని శ్రీ గడ్డం శ్రీకాంత్ మాచారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.
ఎస్‌ఐ విజయ్ చొరవతో రూ.60 వేల అడ్వాన్స్ రీఫండ్
ఈ విషయాన్ని గుర్తించిన మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీ విజయ్ DJ నిర్వాహకుడితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీ గడ్డం శ్రీకాంత్ ముందుగా చెల్లించిన రూ.60,000 అడ్వాన్స్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇప్పించినట్లు కామారెడ్డి జిల్లా పోలీసుల పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే, ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మానవీయ దృక్పథంతో పరిష్కారం చూపుతున్నామని పోలీసులు తెలిపారు.
“నిబంధనలు చెప్పడమే కాదు.. ప్రజల సమస్యకు పరిష్కారం చూపడమే పోలీసుల బాధ్యత” అనే సందేశాన్ని మాచారెడ్డి పోలీసులు మరోసారి చాటిచెప్పారని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.