పత్రికా ప్రకటన
మహబూబాబాద్‌లో సెప్టెంబర్ 23న జాబ్ మేళా: అపోలో ఫార్మసీలో ఉద్యోగావకాశాలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 21
మహబూబాబాద్ జిల్లాలోని జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో సెప్టెంబర్ 23, 2026న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని “అపోలో ఫార్మసీ” సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
అపోలో ఫార్మసీ సంస్థలో ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు ఈ జాబ్ మేళాలో ఎంపిక ప్రక్రియ జరగనుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, స్త్రీ, పురుషులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ప్రకటనలో తెలిపారు.
ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్ పోస్టులకు D.Pharm, B.Pharm, M.Pharm అర్హత కలిగి ఉండాలని, తెలంగాణ PCI సర్టిఫికెట్ ఉండాలని అధికారి పేర్కొన్నారు. ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలు, ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 23న జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం, మహబూబాబాద్‌లో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా జిల్లా ఉపాధి కల్పనాధికారి కోరారు. ఈ ప్రకటనను డి.పి.ఆర్.ఓ, మహబూబాబాద్ జారీ చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.