మహబూబాబాద్, అక్టోబర్ 8 (పవార్ వార్త): క్షయ రహిత సమాజ నిర్మాణమే అందరి లక్ష్యమని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆవిష్కరించిన జోష్ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అన్ని మండలాల ఎంపీడీవోలతో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. టీబీ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టీబీ బాధితులకు పోషకాహారం కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000 అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు టీబీపై అవగాహన పెంచుకోవాలని, వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా టీబీ రహిత గ్రామపంచాయతీలుగా ఎంపికైన 13 మంది సర్పంచులను సన్మానించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలను టీబీ రహిత గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, టీబీ కార్యక్రమానికి సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.

సమాచారం: జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్‌ఓ), మహబూబాబాద్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply