గార్లకు బస్సు సౌకర్యం కల్పించాలి.. ప్రజావాణిలో నోడల్ అధికారికి వినతి
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోతో పాటు ఇల్లందు డిపో నుంచి గార్లకు బస్సులు కేటాయించాలని కోరుతూ గార్ల మేజర్ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజావాణిలో నోడల్ అధికారి మంగమ్మకు వినతిపత్రం అందజేశారు.
బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు
గార్ల మండల కేంద్రానికి తగిన బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేక నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. మహబూబాబాద్, ఇల్లందు డిపోల నుంచి గార్ల మండల కేంద్రానికి బస్సులు కేటాయించి, క్రమం తప్పకుండా నడిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజావాణిలో వినతిపత్రం అందజేత
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నాయకులు కందునూరి ఈశ్వర్, లింగం, శివాజీ, వార్డు సభ్యులు లక్ష్మీశెట్టి, పూర్ణచంద్రరావుతో పాటు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.