మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి మరో 2 వేల ఎకరాలు.. రూ.7,345 కోట్లతో 21 కిలోమీటర్ల ప్రాజెక్టు
హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా మరో 2 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.7,345 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
త్వరలో భూసేకరణ ప్రారంభం
ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు ప్రతిపాదించిన 21 కిలోమీటర్ల అభివృద్ధికి మొత్తం 2 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రైవేట్ పట్టా భూములతోపాటు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ భూములు
భూసేకరణలో భాగంగా ప్రైవేట్ పట్టా భూములు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములు, బఫర్ జోన్ భూములతోపాటు మూసీ ఆక్రమణలో ఉన్న భూములను కూడా సేకరించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఈ ప్రాజెక్టుకు రూ.7,345 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, భూసేకరణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.