నార్కట్‌పల్లి, అక్టోబర్ 9 (పవార్ వార్త): నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దొంగతనం కేసులో నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారంలో కొంత పక్కదారి పట్టించారనే ఆరోపణలు పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో నార్కట్‌పల్లి ఎస్‌ఐని జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఇదే వ్యవహారంలో మరో పోలీస్ అధికారిపై కూడా ఆరోపణలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, సదరు అధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కీలక పోలీస్ అధికారితో సాన్నిహిత్యం కారణంగానే చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

అయితే, బంగారం రికవరీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఆరోపణల నిజానిజాలు, ఇతర అధికారుల పాత్ర, శాఖాపరమైన చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అనే అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply