పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆధ్వర్యంలో నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్‌లో పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేశారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.
ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డాక్టర్ డి. రమణ ధన్నపునేని, డాక్టర్ ఎం. అమరేష్ రావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
2 కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు శస్త్రచికిత్స
క్యాంప్‌లో శస్త్రచికిత్సలు చేసిన 19 మంది చిన్నారుల్లో కేవలం 2 కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడంపై ముఖ్యమంత్రి వైద్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు.
చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.