నిజాంసాగర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి.. ఘనంగా నివాళులు
నిజాంసాగర్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ బహుజన పోరాటాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాహసోపేతంగా పోరాడిన తీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఏలే మల్లికార్జున పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ప్రజాపండరి, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.