గార్ల: పెద్ద కిష్టాపురం గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్‌ను గార్ల మండల యువత ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు.
మండలంలో రామ్ సింగ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను యువత అభినందించింది. రానున్న రోజుల్లో చేపట్టే సేవా కార్యక్రమాల్లో తాము సైతం భాగస్వాములమై “మానవ సేవే మాధవ సేవ” స్ఫూర్తితో పనిచేస్తామని యువత తెలిపింది.
ఈ కార్యక్రమంలో గార్ల 2వ వార్డు సభ్యుడు సారయ్య, 5వ వార్డు సభ్యుడు మల్లిదశ ఉద్యమకారుడు తోడేటి శీనుగౌడ్, తొలిదశ ఉద్యమకారుడు శివాజీ, మలిదశ ఉద్యమకారుడు జానిమియా, మండ రాము, రాజేష్, సాయి, అన్వర్, వినయ్‌తో పాటు యువత, తెలంగాణ ఉద్యమకారులు, రామ్ సింగ్ అభిమానులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

