ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి: వంగూరి వెంకటేశ్వర్లు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గార్ల మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభలో వినతిపత్రం అందజేశారు.
స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో మేజర్ పంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరం నాయక్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
200 రోజుల పని.. రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని డిమాండ్
ఈ సందర్భంగా వంగూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, రైతులకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని కోరారు.
ఎల్‌నినో వాతావరణ ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గిన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వినతి
వామపక్షాల పోరాటాల ఫలితంగా అప్పటి యూపీఏ-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100 రోజుల పని హామీ కల్పిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని వంగూరి వెంకటేశ్వర్లు తెలిపారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.