మద్నూర్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్ గ్రామంలో వర్షాలు సకాలంలో కురవకపోవడం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు సమయానికి లేకపోవడంతో పాటు బోర్లకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంతో పత్తి, సోయా పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.
ఈ నేపథ్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పెద్ద తడ్గూర్ గ్రామంలో ఎండిపోయిన పత్తి, సోయా పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన రైతులకు పరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.