పెద్ద కొడప్ గల్: మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యపై జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ స్పందించారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద కాంట్రాక్టర్ వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేసిన అనంతరం పైప్‌లైన్‌కు సంబంధించిన గుంతలను సక్రమంగా మూసివేయలేదని స్థానికులు సౌదగర్ అరవింద్ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు కురిసే సమయంలో ఈ గుంతల కారణంగా ఇళ్లలోకి పాములు, క్రిమి కీటకాలు వస్తున్నాయని వారు తెలిపారు.

సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించిన సౌదగర్ అరవింద్ సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలను వెంటనే మూసివేసి సమస్యను పరిష్కరించాలని అధికారిని కోరారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని సౌదగర్ అరవింద్ తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.