రాజన్న సిరిసిల్లలో టౌన్ ఏసీపీ కార్యాలయ వార్షిక తనిఖీ
రాజన్న సిరిసిల్లలో వార్షిక తనిఖీల్లో భాగంగా జోన్-III డీఐజీ, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఐపీఎస్ టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, CCTNS, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కేసుల దర్యాప్తు, పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
అలాగే గణేష్ ఉత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.