రాంపల్లిలో రూ.5 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్-5 రాంపల్లిలో పలు కాలనీల్లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కౌకుట్ల జీవన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాగారం డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ ప్రాంతంలోని పలు సమస్యలను తోటకూర వజ్రేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
కార్యక్రమంలో వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. రాంపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో 1000 రోజుల పాలనలో భాగంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వజ్రేష్ యాదవ్ తెలిపారు.
బైట్: తోటకూర వజ్రేష్ యాదవ్
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.