సజ్జన్‌పల్లి పాఠశాలలో SGFI మండల స్థాయి క్రీడోత్సవాలు.. విజేతలకు బహుమతుల ప్రదానం

సజ్జన్‌పల్లి: MPUPS సజ్జన్‌పల్లి పాఠశాలలో శనివారం SGFI మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు మండల విద్యాశాఖాధికారి (MEO) వంచ అంజల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి అండర్-14, అండర్-17 విభాగాల్లో మొత్తం 26 జట్లు పాల్గొన్నాయి.

క్రీడోత్సవాల్లో పాల్గొన్న 26 జట్లు

అండర్-14 విభాగంలో బాలబాలికలకు చెందిన 14 జట్లు, అండర్-17 విభాగంలో 12 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు సాయన్నతో పాటు వివిధ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వసుధ, శోభారాణి, వాహిద్ సిద్ధిఖీ, వేణుగోపాల్, కోటేశ్వర్ రావు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సిద్దవ్వ, ఉప సర్పంచ్ కిష్టయ్య, AAPC చైర్మన్ లావణ్యతో పాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.

SGFI మండల స్థాయి పోటీల విజేతలు

విభాగం ప్రథమ స్థానం ద్వితీయ స్థానం
అండర్-17 బాలురు TGMRS ZPHS పర్మల్ల
అండర్-17 బాలికలు TGMRS లింగంపేట్ ZPHS పోతాయిపల్లి
అండర్-14 బాలికలు UPS సజ్జన్‌పల్లి TGMRS (G) లింగంపేట్
అండర్-14 బాలురు TGMRS (B) ZPHS నల్లమడుగు

విజేతలకు బహుమతుల ప్రదానం

పోటీలు ముగిసిన అనంతరం వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లకు మండల విద్యాశాఖాధికారి వంచ అంజల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply