ఎల్లారెడ్డి, అక్టోబర్ 4: కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించిన రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన విద్యార్థిని థ్యాంకరీ శ్రీజను ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సన్మానించారు.

పోసానిపేట్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు థ్యాంకరీ రాజేందర్ కుమార్తె శ్రీజ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. కష్టపడి చదివి మెడికల్ సీటు సాధించిన శ్రీజ పట్టుదల, కృషి అభినందనీయమని అన్నారు. ఆమె సాధించిన విజయం పోసానిపేట్ గ్రామంతో పాటు కామారెడ్డి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజానికి ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని శ్రీజకు శుభాకాంక్షలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

