తాడ్వాయిలో ఆరు ఎకరాల భూమిపై వివాదం.. నకిలీ పాస్‌బుక్కులతో కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ శివారులో ఆరు ఎకరాల భూమి చుట్టూ వివాదం నెలకొంది. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని కొందరు నకిలీ పత్రాలతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామానికి చెందిన సాయి రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది.

సాయి రెడ్డి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామ శివారులోని సర్వే నంబర్లు 82, 83, 84లో ఉన్న ఆరు ఎకరాల భూమి తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిందని చెబుతున్నారు. సాయి రెడ్డి, ఆయన భార్య స్వరూప, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న కుమారుడు స్వామి రెడ్డికి చెరో రెండు ఎకరాలకు సంబంధించిన పట్టా పాస్‌బుక్కులు ఉన్నాయని, గత 40 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

అయితే స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు అక్రమార్కులు నకిలీ పట్టా పాస్‌బుక్కులు సృష్టించి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సాయి రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ సరిహద్దుల్లో తన కుమారుడు దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుంటే.. సొంత ఊరిలో తమ భూమికి రక్షణ లేకుండా పోయిందని సాయి రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు.

ఈ భూమి వాస్తవానికి ఎవరిది, రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరు ఉంది, నకిలీ పాస్‌బుక్కుల ఆరోపణల్లో వాస్తవమెంత అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. రెవెన్యూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రికార్డులను సమగ్రంగా తనిఖీ చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబంతో పాటు స్థానికులు కోరుతున్నారు.

భూమి వివాదంపై సాయి రెడ్డి వాంగ్మూలం
ఈ వార్తను షేర్ చేయండి
WhatsApp Facebook Telegram

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply