విద్యార్థుల యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. యూనిఫాం డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు సమావేశంలో తెలిపారు. రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని పేర్కొన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించినట్లు వివరించారు.

విద్యార్థులందరికీ నోటు పుస్తకాల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయినట్లు వివరించారు.

వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
WhatsApp Facebook Telegram
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply