ఎల్లారెడ్డి, అక్టోబర్ 7, 2026: ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పు పనుల నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని తాత్కాలికంగా తొలగించి, మున్సిపల్ కార్యాలయంలో భద్రంగా ఉంచాలని కోరుతూ అంబేద్కర్ సంఘ సభ్యులు మున్సిపల్ చైర్మన్ శ్రీ పద్మ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందజేశారు.
రోడ్డు పనులు పూర్తయిన అనంతరం రోడ్డు మధ్యభాగాన్ని గుర్తించి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ విషయంపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హామీ ఇచ్చినట్లు సంఘ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ గాదే తిరుపతి, ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు మ్యాతరి అమృత రావు, డివిజన్ అధ్యక్షుడు మర్లు సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు ఎర్రోళ్ల ఎల్లుబాబు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మెగావత్ కనిరాం తదితరులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply