కామారెడ్డి, అక్టోబర్ 10 (పవార్ వార్త): కామారెడ్డి పట్టణంలోని 46వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ గేరిగంటి లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు
- కామారెడ్డి పట్టణంలోని 46వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం.
- రూ.10 లక్షల వ్యయంతో పనుల ప్రారంభం.
- స్థానిక కౌన్సిలర్ గేరిగంటి లక్ష్మీనారాయణతో కలిసి పనులను ప్రారంభించిన షబ్బీర్ అలీ.
- కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

అలాగే కౌన్సిలర్లు అన్వార్, షేరు, సత్యం, సిద్దిక్, అంజాద్, యూనుస్, చిట్టిబాబు, గంగాధర్, లోలం శ్రీనివాస్, లక్ష్మణ్, మన్సూర్, గేరిగంటి స్వప్న, పిట్ల వేణు, ఏజాజ్, గూడెం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
పట్టణ అధ్యక్షుడు సందీప్, రాజగౌడ్, భూమని బాలరాజు, అనుమాల రాము కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, అశోక్ రెడ్డి, పండ్ల రాజు, కన్నయ్య, నరేందర్ రెడ్డి, గొనె శ్రీనివాస్, ముబషీర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


