మహమ్మద్ నగర్: జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం బిచ్కుందలోని డీబీఎల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.


ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహమ్మద్ నగర్ మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బిచ్కుందకు బయలుదేరారు. ఎమ్మెల్యే కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటూ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు నాయకులు తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో తునికి పల్లి సర్పంచ్ రాములు, కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు బానోత్ లోక్య నాయక్, డాక్టర్ విజయ్, రాజయ్య సేఠ్, రమావత్ గోపీ సింగ్, సాయ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వివాహ రిసెప్షన్ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
— పవార్ వార్త సూత్రా
