సీనియర్ జర్నలిస్ట్ సాలె ఆశన్న గుండెపోటుతో మృతి
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మృతి జిల్లా జర్నలిజం రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
సమాచారం ప్రకారం, ఆశన్న కారు నడుపుకుంటూ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకోగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలిసింది.
జర్నలిజం రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సేవలందించిన సాలె ఆశన్న ఆకస్మిక మృతి పట్ల పాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆశన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సాలె ఆశన్న మరణం కామారెడ్డి జిల్లా జర్నలిజం రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


