అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమర ప్రసాద్ అరెస్టుకు డిమాండ్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమర ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిరాహార దీక్ష చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకన్నకు ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘ సభ్యులు సంఘీభావం తెలిపారు.
అమర ప్రసాద్ అంబేద్కర్‌ను కల్పిత నాయకుడిగా పేర్కొంటూ పుస్తకం రాస్తున్నారని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమర ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అట్కారి బబ్లు, అంబేద్కర్ సంఘ సభ్యులు నీరుడి నాగరాజు, పెద్దబల్ రాజు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మెగావత్ కానిరాం, వెంకటయ్య, ఆంజనేయులు, సాయిలు, శివరాములు, తుపాకుల శంకర్ తదితరులు కొంగల వెంకన్నకు సంఘీభావం తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.