అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: కాముని సుదర్శన్
కామారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ చేపడుతున్న నిరాహార దీక్షకు కాముని సుదర్శన్ నేత సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేద, బడుగు, బలహీన, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం (TGBCLA) రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేతతో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రవణ్ కుమార్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి రాజేందర్, జిల్లా బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లింగమయ్య పాల్గొన్నారు.
అలాగే బీసీ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొని కొంగల వెంకట్ చేపడుతున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.