ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ముదేలి సర్పంచ్ లక్ష్మణ్

ఎల్లారెడ్డి: గాంధారి మండలం ముదేలి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సర్పంచ్ లక్ష్మణ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న శ్రద్ధకు ఆకర్షితుడై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ముదేలి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ లక్ష్మణ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగినట్లు క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply